రియల్ లైఫ్ లో చాలామంది విలన్స్ ని చూస్తున్నాను
on Jan 4, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో సీరియల్స్ వాళ్ళు చాలామంది వచ్చారు. అలాగే కావ్య కూడా వచ్చింది. శ్రీముఖి కావ్యని ఒక ప్రశ్న అడిగింది "సీరియల్స్ లో విలన్స్ ని చూసినప్పుడు ఎందుకురా వీళ్ళు ఇంత విలనిజం చూపిస్తారు వీళ్ళను చంపేస్తాను అనిపించిందా" అని అడిగింది. దానికి కావ్య "రియల్ లైఫ్ లో చాలా మంది విలన్స్ ని చూస్తున్నాను కాబట్టి సీరియల్స్ లో విలన్స్ ని చూసాక పెద్దగా ఏమీ అనిపించదు" అని రిప్లై ఇచ్చింది కావ్య. ఈ ఆదివారం రాబోయే ఎపిసోడ్ ని హీరోయిన్స్ వెర్సెస్ విలన్స్ థీమ్ తో తీసుకొచ్చారు. ఇందులో హీరోయిన్స్ అంతా రకరకాల సెక్సీ భంగిమలు పెట్టారు.
కావ్య, దీపికా రంగరాజు, సుహాసిని, అమూల్య గౌడా అందరూ కూడా ఈ భంగిమలు పెట్టి ఎంటర్టైన్ చేశారు. ఇక నెటిజన్స్ అంతా కూడా నిఖిల్ ని కావ్యని జోడిగా పిలవండి..." అంటూ కోరుతూ మెసేజెస్ పెడుతున్నారు. ఐతే నిఖిల్ - కావ్యకి కొన్ని నెలల నుంచి ఇద్దరికీ సరిగా కెమిస్ట్రీ కుదరడం లేదు. నిఖిల్ ని కావ్య వదిలేసింది అలాగే నిఖిల్ మాస్క్ మ్యాన్ , విలన్ అంటూ చెప్తోంది. నిఖిల్-కావ్య మధ్య ఏడేళ్ల రిలేషన్ ఒక్కసారిగా బ్రేక్ అయ్యింది . నిఖిల్ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు కావ్యతో బ్రేకప్ చెప్పేసి తాను సింగిల్ అంటూ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాడు. నిఖిల్, కావ్య మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం వాళ్ళు కచ్చితంగా కలవాలి అని కోరుకుంటున్నారు.
Also Read